మంచి నీటి కోసం రోడ్డు ఎక్కిన మహిళలు ఆందోళనకారులతో చర్చించి సమస్యని పరిష్కరించిన ఎమ్మెల్యే

మంచి నీటి కోసం మహిళలు రోడ్ ఎక్కిన సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది.

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని 3వ వార్డు నందు గత 20 రోజుల నుంచి మంచి నీటి సరఫరా జరగకపోవడం తో స్థానిక కాటూరి వారి పాలెం సమీపంలోని ఒంగోలు కర్నూల్ జాతీయ రహదారి నందు మహిళలు రాస్తారోకో నిర్వహించారు.
సుమారు అరగంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడి వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.

రాస్తారోకో లో చిక్కుకున్న శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆందోళన నిర్వహిస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని హుటాహుటిన అధికారులను పిలిపించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేశారు

ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ కమీషనర్ డానియల్ జోసప్, యస్ఐ శ్రీహరి, నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు