మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోరీ

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని బాప్టిస్ట్ పాలెం మండల పరిషత్ ప్రాథమిక ‌పాఠశాల నందు చోరీ జరిగిన సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

 

 

ఆగస్టు 16 తేదీ నుంచి పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం పాఠశాల తీసే సమయంలో గేట్లు తాళాలు పగలగొట్టిన విషయం గమనించి సదరు రూములు తనిఖీ చేయగా ఆ రూమ్ లో ఉన్న 38 వేల రూపాయలు చేసే ఎల్ఈడి టీవీ కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని భావించి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పొదిలి ఎస్ఐ శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి క్లూస్ టీమ్ కు సమాచారం అందించారు.


తొలిదశ నాడు నేడు కార్యక్రమం ప్రారంభమైన రోజే దొంగతనం జరగటంతో చర్చనీయాంశమైంది.

 

తొలిదశలో అభివృద్ధి చేసిన నాడు నేడు పాఠశాల నందు నైట్ వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు