అక్రమ మద్యం పట్టివేత కేసు నమోదు ముగ్గురు అరెస్టు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
అక్రమ మద్యం పట్టివేత కేసు నమోదు ముగ్గురు అరెస్టు
పొదిలి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారులలు మరియు డిటియఫ్ సిబ్బంది సంయుక్త జరిపిన దాడిలో మద్యం పట్టివేత సంఘటన శుక్రవారం నాడు చోటుచేసుకుంది.
యస్ఈబి యస్ఐ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించే సమయంలో ఖాసిం ఫీరా, వలి అనే ఇద్దరు వ్యక్తులు ఏడు మద్యం కేసులు తీసుకొని ఆటో వచ్చే
సమయంలో దాడి చేసి ఏడు కేసుల మద్యం స్వాధీనం మరియు ఆటో ను అందులో ఉన్న ఖాసిం ఫీరా పరార్ కాగా వలి ని అదుపులోకి తీసుకొని విచారించగా పెదరికట్ల ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్న సేల్స్ సూపర్ వైజర్ పాలకిట్టు శ్రీను, సెల్స్ మెన్ కాకర్ల మనోజ్ కుమార్ ద్వారా తెచ్చినట్లు తెలపగా
నాలుగురి పై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు యస్ఈబి యస్ఐ తనను కలిసిన విలేఖరులతో తెలిపారు.