ద్విచక్ర వాహనం చోరీ కేసు నమోదు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:
పొదిలి పట్టణంలోని పుల్లరు పేట 1 లైన్ లో నివాసం ఉంటున్న మల్లెల విజయ సతీష్ యొక్క ద్విచక్ర వాహనం తేదీ :-15/7/2023 న AP15AX8477 నంబర్ గల మోటార్ సైకిల్ తన ఇంటి వద్ద పెట్టగా కనిపించలేదని దానిని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారని ఇచ్చిన ఫిర్యాదుపై పొదిలి ఠాణా అధికారి వెంకట సైదులు కేసు నమోదు చేసినట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు