ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్ లపై యుటిఎఫ్ నిరసన

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్ లపై యుటిఎఫ్ పొదిలి డివిజన్ కార్యదర్సులు శ్రీ షేక్ అబ్దుల్ హై , శ్రీ పీ బాల వెంకటేశ్వర్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు

 

వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి దానిలోని నెట్వర్క్ సమస్యలు లాగిన్ సమస్యలు సర్వర్ సమస్యలు పరిష్కరించకుండాపై బయోమెట్రిక్ విధానము మూల పడిందని అన్నారు

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉపాధ్యాయుల ఇంటిగ్రేటెడ్ టీచర్ అటెండెన్స్ యాప్ ను ప్రవేశ పెట్టిందని అన్నారు

ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయంలో ఉదయం 9 గంటల లోపు సుమారు లక్ష 80 వేల మంది ఉపాధ్యాయులు ఆన్లైన్లో అటెండెన్స్ వెయ్యాలంటే లాగిన్ సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, సర్వ సమస్యలు, నెట్వర్క్ సమస్యలు మొదలగున్నవి సాంకేతికంగా ఉపాధ్యాయులకు అనేక మానసిక శోభకు గురి చేస్తుందని అన్నారు ప్రభుత్వమే గ్రామ సచివాలయ వాలంటీర్లకు ఇచ్చిన సెల్ ఫోన్లు మాదిరి ప్రతి పాఠశాలకు లేదా ప్రతి ఉపాధ్యాయునికి డివైస్ ఇచ్చి నెట్ వర్క్ సమస్య లేకుండా ప్రొవైడ్ చేసినప్పుడు ఉపాధ్యాయులు కచ్చితంగా హాజరు వేస్తామని అని అన్నారు

ఆన్ లైన్ అటెండెన్స్ కు మేము సిద్దమే  కానీ సర్వర్ పెట్టే హింస భరించలేక పోతున్నామని అన్నారు

 

దయచేసి పనిచేయని యాప్ లతో,బలహీన సర్వర్లతో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయ చేయకుండా
ప్రశాంత వాతావరణంలో ఎంతో ఇష్టంగా సాగిపోవలసిన బోధనాభ్యసన కార్యక్రమాన్ని అడ్డుకోకండి అని వారు అన్నారు