మోదీపై పోటీకి షాలిని యాదవ్ ను తిరిగి ఖరారు చేసిన ఎస్పీ
వారణాసిలో మోదీపై పోటీకి షాలిని యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ ఖరారు చేసింది.
ఎన్నికల నామినేషన్ చివరిరోజు సమాజ్ వాది పార్టీ అనూహ్యంగా తెరపైకి తెచ్చిన తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ స్క్రిటినిలో ఎన్నికల సంఘం అనర్హుడిగా ప్రకటిస్తూ తిరస్కరించడంతో ముందుగా నామినేషన్ దాఖలు చేసినట్లుగానే షాలిని యాదవ్ ను రంగంలోకి దింపింది సమాజ్ వాదీ పార్టీ.
తేజ్ బహదూర్, షాలిని యాదవ్ లు శుక్రవారంనాడు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత పార్టీ ఆఫీసు వద్ద తేజ్ బహదూర్ కు రక్షాబంధన్ ను కట్టిన షాలిని తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి తేజ్ బహదూర్ తో కలిసి తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటిరోజు ప్రచారం కావడంతో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలాదిగా తరలివచ్చారు.