యన్ యస్ యస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

 

నేషనల్ సర్వీస్ స్కీం (యన్ యస్ యస్) ప్రత్యేక క్యాంపు కార్యక్రమం స్థానిక రామాయణకండ్రిక గ్రామం నందు బుధవారం నాడు నిర్వహించారు.

స్థానిక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పెమ్మని ఓంకర్ యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కామునూరి వెంకట్రావు ఆధ్వర్యంలో పాఠశాల నందు మొక్కలు నాటడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, బస్ షెల్టర్ కు రంగులు వేయడం తదితర కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తారా వాణి యన్ యస్ యస్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర రావులు మీడియాతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు భోజన సదుపాయాన్ని మాదలవారిపాలెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పెమ్మని బాల వెంకటేశ్వర్లు కల్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు