ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలి
ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని దరిశి మోటార్ వాహనం తనిఖీ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నాడు స్థానిక పొదిలి లారీ యూనియన్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రాణం ఎంతో విలువైనదని, వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో బాధ్యతగా వ్యవహరించాలని వాహన చోదకులు రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలన్నారు. జాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
వాహనాలు అతివేగంగా నడిపేటప్పుడు ఒకసారి మనకోసం ఎంతో ఆప్యాయతతో ఎదురుచూసే కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రవాణా శాఖ ఆధ్వర్యంలో భద్రత వారోత్సవాలు నిర్వహిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో పొదిలి లారీ యూనియన్ నాయకులు డ్రైవర్లు,లారీ క్లీనర్లు తదితరులు పాల్గొన్నారు