బెల్లంకొండ విద్యా సంస్థలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన వైస్ ఛాన్సలర్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

బెల్లంకొండ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నందు ఆకస్మికంగా యన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణు వర్ధన్ రెడ్డి పర్యటించారు.

సోమవారం నాడు స్థానిక కంభాలపాడు లోని బెల్లంకొండ విద్యా సంస్థ నందు రికార్డులు, ప్రయోగశాలలు, గ్రంధాలయం, వసతి గృహం, వ్యవసాయ క్షేత్రాలు, డిజిటల్ ల్యాబ్ లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపకులపతి బృంద సభ్యులు డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ రాంబాబు, గురవారెడ్డి , విద్యా సంస్థ ఛైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ విజయలక్ష్మి, మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు