20వతేది నుండి కౌలు రైతుల గ్రామ సభలు : తహశీల్దార్
20వ తేది నుండి కౌలు రైతుల గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ జె ప్రభాకరరావు ఆదివారంనాడు సామాజికమాధ్యమం ద్వారా తెలిపారు.
భూ యజమానులు మరియు కౌలుకు భూమి తీసుకున్న వారందరూ గ్రామ సభలో పాల్గొని సంబంధించిన కౌలు రైతు కార్డుల మంజూరు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్, వ్యవసాయ అధికారి, లీడ్ బ్యాంకు అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు హాజరుకానున్నారని తహశీల్దార్ ప్రభాకరరావు తెలిపారు.